Sripada Sri Vallabha (శ్రీపాద శ్రీ వల్లభ)

Digambara..Digambara..Sripada Vallabha Digambara..

                      ఘండికోట శ్రీపాద శ్రీ వల్లభ రాజశర్మ                       Ghandikota Sripada Sri Vallabha Raaja Sharma

 Events

Sripada Satsang – September Month Photos – 07.09.2013 (Photos)

Sripada Satsang – Octoberber Month Photos – 20.20.2013 (Photos)

Annaprasada Camp – Guru Dwadasi – 31.10.2013 (Photos)

Annaprasada Camp – Guru Dwadasi – 31.10.2013 (Video-1)

Annaprasada Camp – Guru Dwadasi – 31.10.2013 (Video-2)

 

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే ... శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణాశ్రితులారా... ఎందుకు జరిగాయో ఎలా జరిగాయో తెలియని సంఘటనలు క్రీ.శ. 2006 నుండి మాకు  శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ( ಶ್ರೀಪಾದ ಶ್ರೀವಲ್ಲಭ, श्रीपाद श्रीवल्लभ, Шрипада Шри Валлабха ) వారి సాంగత్యం ఏర్పడేలా చేసాయి.  అప్పటి నుండి  వారిపై మాకు అమితమైన భక్తి. శ్రీపాద శ్రీ వల్లభుల నామస్మరణ అంటే మాకు చాల ఇష్టం. ఈ వెబ్సైట్ శ్రీపాద శ్రీ వల్లభులవారి ఆశీర్వాదం తో  తయారు చేయబడినది.

ఈ వెబ్సైట్ రూపకల్పనలో శ్రీపాదుల వారే దగ్గరుండి ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది. సూక్ష్మరూపం లో చిన్న వెలుగు వలే (జ్యోతి రూపం) నా కుడి కంటి దగ్గర ఈ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నంతసేపూ ఉండేవారు. చాలా వరుకు ఫోటోలు మరియు  ఇతరత్రా మెటీరియల్ నా సొంత కెమెరా ద్వారా తీసినవే మరియు నేను తయారు చేసినవే, అంటే శ్రీపాదులవారు వారి ఆశీర్వచనములతో వారే నాద్వారా చేయించారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు టైపింగ్ రాని నేను ఇంత ఇన్ఫర్మేషన్ తెలుగులోనే ఇచ్చానంటే అది  శ్రీపాదుల శ్రీ పాదుకా మహిమే కాక ఇంకేమవుతుంది? 

ఈ వెబ్సైట్ రూపకల్పనలో ప్రత్యక్షంగా సహకరించిన శ్రీపాద శ్రీ వల్లభ స్వామీవారికి మరియు పరోక్షంగా సహకరించిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. శ్రీపాద వల్లభుల భక్త భందువులందరికి  శ్రీ పాదుల వారి ఆశీస్సులు లభించుగాక ..... 

మీ

కీర్తివల్లభ

 దిగంబరా..దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా.. దిగంబరా..దిగంబరా.. నృసింహ సరస్వతి దిగంబరా.. దిగంబరా..దిగంబరాశ్రీస్వామి సమర్ధ దిగంబరా...

 

 పూర్తి పేరు  ఘండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ   
 కాలం   క్రీ.శ ౧౩౨౦(1320 ) -  క్రీ.శ ౧౩౫౦(1350 ) మధ్య  
 జన్మ స్థలం పిఠాపురం (పీఠికాపురం) 
 యోగ స్థలం   కురవపురం/కురుంగడ్డ / కురుగడ్డ  
 నివాసం  మహాకారణలోకం మరియు మహాభూమి   
 తల్లి - తండ్రులు  శ్రీమతి సుమతీ మహారాణి - శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ  
 సహొదరి / సహొదరులు విద్యాధరి, రాధ, సురేఖ, శ్రీధరరాజ శర్మ, రామరాజ శర్మ  
మాతామహులు  సత్యరుషీశ్వర మల్లాది బాపనార్యులు (తాతయ్య ) - రాజమాంబ ( అమ్మమ్మ)
 అవతారం   యోగపూర్ణ దత్తావతారం మరియు జ్ఞానావతారులు
 అవతార ప్రయోజనము  విశ్వకుండలిని ని కదిలించడం
 తత్వము పృథ్వీతత్వం
 వైఖరి  స్మరణప్రియ    
 శరీరం  ఆజానుబాహులు, విశాలనేత్రి,స్థూలశరీరం చిత్ర విచిత్ర దివ్య స్పందనలు కలిగినది  
 అనుష్టించునది అగ్నివిద్య - శ్రోత్రియ లక్షణం 
 జన్మ విశేషాలు  చిత్తానక్షత్రం, తులారాశి, సింహలగ్నం, వినాయక చతుర్ధి, మంగళవారం,ఉషఃకాలం
 గోత్రం  భరద్వాజ, ఆపస్తంభ సూత్ర వెలనాటి వైదిక శాఖ,కృష్ణయజుర్వేదులు
 రూపం  అగ్నివస్త్రధారి అయిన అగ్నిరూపం,శాక్తరూపం
 స్వరూపం  జ్యోతి స్వరూపం (మహాగ్ని సదృశమైనది),యతి స్వరూపం
 మాట్లాడే భాష  తెలుగు, సంస్కృతం , సంధ్యా భాష మరియు శంబల భాష 
 పారాయణ గ్రంధం  సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం
 ప్రీతి పాత్రులు
 • శ్రీపాదులవారి సహోదరి అయిన వాసవి కన్యకా పరమేశ్వరి  
 • నవనాథులు  
 • వెంకట సుబ్బమాంబ -వెంకటప్పయ శ్రేష్టి  దంపతులు               
 • అమ్మాజమ్మ- నరసింహ వర్మ దంపతులు  
 • తణుకు కు చెందిన శ్రీ వాజపేయాజులు -వారి వంశీకులు  
 ఇష్టమైన వంటకాలు
 •  గోధుమరవ్వ హల్వా 
 • బీరకాయ పప్పు 
 • తోటకూర
 • ఖీర్
 • గోక్షీరం   


 

 దత్తదాసు సంక్షిప్తీకరీంచిన దత్త చరిత్రము (ఇది 53 సార్లు చదివిన ఒకసారి గురుచరిత్ర పారాయణ చేసినంత ఫలితం)
 "పూర్వయుగములందు అనసూయామాతకును, అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే యీనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్దారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీమంగళము అగును గాక!"

                                                                                                                              

Members Area

సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం

'సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం' అనే గ్రంధం స్వర్గీయ మల్లాది గోవింద దీక్షితులు గారు అందజేసిన శుద్ధ ప్రతి. ఇందులో అసలు సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం లో ఉన్న అన్ని అధ్యాయాల లోని అన్ని అంశాలు ఎటువంటి తీసివేతలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపబడిన గ్రంధం.  పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం వారు అందిస్తున్న గ్రంధం 'శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృత' మే కాని 'సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం' కాదని దయచేసి గమనించండి. సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం ను గురించి మరింతగా చదవడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

శ్రీపాదుల వారు దత్తదాసు ఇంట పలికిన ద్వాదశ (12) అభయ వాక్యాలు

 1. నా చరిత్ర పారాయణము  చేయబడు ప్రతిచోట నేను సూక్ష్మరూపమున ఉండును.
 2. మనోవాక్కయకర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడుచుందును.
 3. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్నసమయమున బిక్ష స్వీకరించెదను, నా రాక దైవరహస్యము.
 4. సదా నన్ను ధ్యానించువారి కర్మలను అవి ఎన్ని జన్మాంతరములనుండి ఉన్నవిఅయినను వాన్నంటిని భస్మిపటములు  గావించెదను.
 5. అన్నమో రామచంద్రా అని అలమటించువారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడ నయ్యెదను .
 6. నేను శ్రీ పాద శ్రీ వల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును.
 7. నీవు శుద్ధాంత:కరణుడవేని నా కటాక్షము సదా నీయందు ఉండును.
 8. నీవు ఏ దేవతాస్వరూపమును ఆరాదించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చెసికొన్ననూ నాకు సమ్మతమే!
 9. నీవు చేయు ప్రార్ధనలన్నియూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను , నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందజేయబడును .
 10. శ్రీ పాద శ్రీ వల్లభుడనిన పరిమితమయిన యీ నామ రూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపము ను అనుష్టానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు.
 11. నాది యోగసంపూర్ణ  అవతారము . మహా యోగులు, మహా సిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరు నూ నా యొక్క అంశలే.
 12. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును , కర్మ మార్గమును భోదించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను . 


Recent Blog Entries

Oops! This site has expired.

If you are the site owner, please renew your premium subscription or contact support.